రజనీకాంత్ నటించే 'అన్నాత్తే' షూటింగ్ లో 8 మందికి కరోనా
By: chandrasekar Wed, 23 Dec 2020 9:10 PM
సూపర్ స్టార్ రజనీకాంత్
నటించే 'అన్నాత్తే' షూటింగ్ అకస్మాత్తుగా ఆగిపోయింది. ఈ సినిమా షూటింగ్
లో 8 మందిలో కరోనా ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారించడంతో
హైదరాబాద్‌లో 'అన్నాత్తే ' షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు తనను తాను వేరుచేసుకున్న
రజనీకాంత్ తిరిగి చెన్నైకి రానున్నాడు.
కరోనా లాక్ డౌన్ తరువాత
రజనీకాంత్ పుట్టినరోజు వేడుకల ముగించుకొని
'అన్నాత్తే' షూటింగ్
తిరిగి ప్రారంభమైంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రజిని తో బాటు ఖుష్బూ , నయనతార
మరియు మీనా ఈయన సరసన నటిస్తున్నారు.
ఈ సినిమా హైదరాబాద్‌లో
డిసెంబర్ 14 న చిత్రీకరణ తిరిగి ప్రారంభమైంది. ఈ షూటింగ్లో
పాల్గొన్న 8 మందిలో కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్ నిర్ధారించబడింది.
దీంతో ఇన్ఫెక్షన్ లేనప్పటికీ రజనీకాంత్ తనను తాను వేరుచేసుకున్నాడు. అతను
హైదరాబాద్ నుండి త్వరలో చెన్నైకి తిరిగి రానున్నట్లు తెలిసింది.