రక్తంలో అది తగ్గితే కరోనా సోకినట్లే భావించాలి..
By: Sankar Wed, 14 Oct 2020 5:31 PM
కొందరికి కరోనా వేసిన కూడా వారిలో ఎటువంటి లక్షణాలు కనిపించవు కానీ అలాగే నిర్లక్ష్యం చేస్తే అది ప్రమాదకరంగా కూడా మారే అవకాశం ఉంటుంది.. అందుకే రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గితే కరోనా సోకినట్లుగా అనుమానించాలని వైద్యులు చెబుతున్నారు. కరోనా లక్షణాలు లేనప్పటికీ రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను ప్రమాణంగా తీసుకుని ఆ మేరకు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గడాన్ని వైద్యపరిభాషలో హైపోక్సియాగా వ్యవరిస్తారు.
కొందరిలో కరోనా లక్షణాలు కనిపించనప్పటికీ ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండటాన్ని వైద్యులు గుర్తించారు. వీరిని కూడా కరోనా సోకినట్లుగానే భావించి చికిత్స అందించాలని పేర్కొన్నారు. అశ్రద్ధ చేసిన పక్షంలో ప్రాణాలకు ముప్పుగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు. హైపోక్సియాను ముందుగా గుర్తించని పక్షంలో రోగి ప్రమాదంలో పడవచ్చని పేర్కొన్నారు.
సాధారణంగా బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ వల్ల ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకి న్యుమోనియా బారిన పడతారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కూడా న్యుమోనియాకు దారితీస్తుందని గుర్తించారు. దీనిని కొవిడ్ న్యుమోనియాగా అని వ్యవహరిస్తున్నారు.
మరోవైపు రక్తంలోని సాధారణంగా ఆక్సిజన్ స్థాయి 75 నుంచి 100 ఎంఎం హిమోగ్లోబిన్ వరకు ఉంటుంది. ఈ శాతం 95 కంటే ఎక్కువగా ఉంటే సాధారణంగా పరిగణించవచ్చు. 95 కంటే తక్కువగా ఉంటే అసాధారణంగా పరిగణిస్తారు. పల్స్ ఆక్సిమీటర్‌తో రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను గుర్తించవచ్చు.