Advertisement

  • హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆస్పత్రిలో "హెడ్ నర్సు" కరోనాతో కన్నుమూత

హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆస్పత్రిలో "హెడ్ నర్సు" కరోనాతో కన్నుమూత

By: chandrasekar Sat, 27 June 2020 11:03 AM

హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆస్పత్రిలో "హెడ్ నర్సు" కరోనాతో కన్నుమూత


కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో మరో నాలుగు రోజుల్లో రిటైర్మెంట్ కాబోతున్న ప్రభుత్వ ఆస్పత్రిలో హెడ్ నర్సును పొట్టనపెట్టుకుంది కరోనా మహమ్మారి. హైదరాబాద్‌లో ఈ ఘటన జరిగింది.

హైదరాబాద్ ఛాతీ ఆస్పత్రిలో పనిచేస్తున్న హెడ్ నర్సు గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ పేషెంట్లకు సేవలు అందించారు. ఈ క్రమంలో ఆమెకు కూడా కరోనా వైరస్ సోకింది. ఆమె పరిస్థితి బాగోకపోవడంతో వైద్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.

గాంధీలో చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం కన్నుమూసింది. మహమ్మారి బారిన పడిన వ్యాధిగ్రస్తులను కాపాడుతూ చివరికి ఆమె కూడా కరోనాతో మృత్యు ఒడిలోకి చేరుకుంది. ఈనెల 30వ తేదీన రిటైర్మెంట్ కాబోతోంది. అంతలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్తకు కూడా కరోనా వైరస్ సోకింది.

ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి ఏ మాత్రం తలవంచకుండా వారి విధులను నిర్వర్తిస్తూ కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకోవటం సమాజానికి ఒకింతమంచి సందేశాన్ని ఇస్తుంది.

Tags :
|

Advertisement