Advertisement

  • చల్లని నీటితో స్నానం చేస్తే ఎన్నీ ఉపయోగాలు ఉన్నాయి తెలుసా....!

చల్లని నీటితో స్నానం చేస్తే ఎన్నీ ఉపయోగాలు ఉన్నాయి తెలుసా....!

By: Anji Mon, 09 Nov 2020 5:02 PM

చల్లని నీటితో స్నానం చేస్తే ఎన్నీ ఉపయోగాలు ఉన్నాయి తెలుసా....!

అసలే వెన్నులో వణుకు పుట్టిస్తున్న చలి. రాత్రయిందంటే చాలు చలికి గజ గజా వణకాల్సిందే. మరి ఇలాంటి పరిస్థితిలో చన్నీటితో స్నానం చెయ్యాలంటే ఒళ్ళు జివ్వుమంటుంది. కానీ మీకు తెలుసా చన్నీటి స్నానమే ఆరోగ్యానికి మంచిదని. అందరూ చలికాలం వేడి నీటితోనే స్నానం చేస్తారు.

అదే వేస‌వి కాలం వ‌స్తే చ‌న్నీళ్ల స్నానం చేస్తారు. నిజానికి అస‌లు ఏ కాలంలో అయినా మ‌న‌కు చ‌న్నీళ్ల స్నాన‌మే మంచిది. నిత్యం చ‌న్నీళ్ల‌తో స్నానం చేస్తే మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!

చల్లని నీటితో స్నానం రోగ నిరోధకతను పెంచుతుంది. రెగ్యులర్‌గా చల్లని నీటి స్నానం చేస్తే మన శరీరంలో రోగాలతో పోరాడే తెల్ల రక్త కణాలు సంఖ్య పెరుగుతుంది. ఫలితంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

అందువ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.చల్లని నీటితో స్నానం సాధారణ జలుబును నివారిస్తుంది. ఉదయం చేసే చన్నీటి స్నానం వల్ల సహజంగా వచ్చే జలుబును నివారించవచ్చు.

చ‌ర్మ సంబంధ స‌మస్య‌లు ఉన్న‌వారు చ‌న్నీళ్ల‌తో స్నానం చేస్తే మంచిది. చ‌ర్మం కాంతివంతంగా కూడా మారుతుంది. చలికాలంలో చన్నీటి స్నానం కంటే వేడినీళ్ల స్నానాన్నే ఎక్కువమంది ఇష్టపడతారు. అయితే చన్నీళ్లతో స్నానం చేస్తే కూడా మన శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయట.

అనేక రకాల అనారోగ్యాల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. చ‌న్నీళ్ల‌తో స్నానం చేస్తే ఒత్తిడి, ఆందోళ‌న దూర‌మ‌వుతాయి. డిప్రెష‌న్ కూడా త‌గ్గుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా స‌క్ర‌మంగా జ‌రుగుతుంది. దీంతో గుండె సంబంధ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంది.

చ‌న్నీళ్ల స్నానం చేయ‌డం వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం ప్ర‌క్రియ మెరుగు ప‌డి జీవ‌క్రియ‌లు స‌క్ర‌మంగా సాగుతాయి. ఇది థైరాయిడ్‌, డ‌యాబెటిస్ వంటి వ్యాధులు ఉన్న‌వారికి మేలు చేస్తుంది.శరీరం ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తుంది.

ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చన్నీటి స్నానం ఎంతో మంచిది. రోజూ చ‌న్నీళ్ల‌తో స్నానం చేస్తే అధిక బ‌రువు కూడా తగ్గుతారు. చిన్న పిల్ల‌ల‌కు నిత్యం చ‌న్నీటితో స్నానం చేయిస్తే వారిలో పెరుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది.

చ‌ర్మంలో ఉండే హానిక‌ర కెమిక‌ల్స్‌, ఇత‌ర వ్య‌ర్థ ప‌దార్థాలు బ‌య‌టికి వెళ్లిపోతాయి. చ‌న్నీళ్లు స్నానం వల్ల చ‌ర్మ రంధ్రాలు మూసుకుంటాయి. క‌నుక శరీరంలో మురికి చేర‌దు. దీంతో చ‌ర్మం శుభ్రంగా ఉంటుంది. మొటిమ‌లు వంటివి రావు.

అంతేకాదు చ‌న్నీటితో స్నానం చేస్తే వెంట్రుక‌లు న‌ల్ల‌గా అవుతాయ‌ని ప‌లు ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. జుట్టు కూడా రాల‌కుండా దృఢంగా పెరుగుతుంది. చుండ్రు కూడా రాదు.

Tags :

Advertisement