Advertisement

  • పీసీసీ చీఫ్ అవ్వాలంటే డబ్బులు అవసరం లేదు...జగ్గారెడ్డి

పీసీసీ చీఫ్ అవ్వాలంటే డబ్బులు అవసరం లేదు...జగ్గారెడ్డి

By: Sankar Mon, 07 Dec 2020 9:23 PM

పీసీసీ చీఫ్ అవ్వాలంటే డబ్బులు అవసరం లేదు...జగ్గారెడ్డి


తెలంగాణ పీపీసీ అధ్యక్షపదవికి ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో.. పీసీసీ చీఫ్ పోస్ట్ ఆశిస్తున్నవారంతా రేస్‌లోకి వచ్చారు.. నేనే ట్రై చేస్తున్నానంటే.. నేను రేసులో ఉన్నానని ప్రకటిస్తున్నారు నేతలు.. ఇక, మొదటి నుంచి పీసీసీపై ఆలోచిస్తున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. నేను పీసీసీ కోసం సీరియస్‌గా ట్రై చేస్తున్నానని ప్రకటించారు..

పీసీసీ అవ్వాలంటే డబ్బులు అవసరం లేదన్న జగ్గారెడ్డి... ఎన్నికల్లో ఓడిపోతే ఉత్తమ్‌కు అంటగట్టే వారు.. గెలిస్తే ఎందుకు ఆయనకు క్రెడిట్ ఇవ్వరు? అని ప్రశ్నించారు. ఇక రేపు తలపెట్టిన భారత్‌ బంద్‌పై గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. రైతులకు నష్టం చేసే చట్టాలను బీజేపీ తీసుకొచ్చిందని విమర్శించారు..

పార్లమెంట్‌లో బిల్లు పెట్టినప్పుడే సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు ఈ బిల్లులను వ్యతిరేకించారని గుర్తుచేసిన ఆయన.. రాజకీయం కోసం తప్ప ప్రజల కోసం బీజేపీ ప్రభుత్వం నడపడంలేదని ఆరోపించారు

Tags :
|

Advertisement