విజయశాంతి పార్టీ మారడం లేదు ...కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్
By: Sankar Wed, 28 Oct 2020 7:37 PM
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి పార్టీ మారుతారంటూ వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. విజయశాంతి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ తెలిపారు. ఆయన బుధవారం విజయశాంతితో భేటీ అనంతరం మాట్లాడుతూ...
‘విజయశాంతికి రాహుల్ గాంధీ, సోనియాగాంధీ అంటే ఎంతో గౌరవం. కరోనా కారణంగా ఆమె ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఆమె పార్టీలోనే ఉంటారు. పార్టీ మారుతారనేది ప్రచారం మాత్రమే. విజయశాంతిని మేమంతా ఎంతో గౌరవిస్తాం. కరోనా కారణంగానే కొత్త ఇన్‌ఛార్జ్‌ను కలవలేకపోయినట్లు చెప్పారు’ అని అన్నారు. కాగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సోమవారం విజయశాంతి నివాసానికి వెళ్లి ఆమెతో దాదాపు గంటపాటు భేటీ అయిన విషయం తెలిసిందే..
ఇక దుబ్బాక ఉప ఎన్నికలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ కూడా రాదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి అన్నారు. హరీశ్‌రావు మాటలు వింటుంటే.. దుబ్బాకలో పోలింగ్ జరిగిన తర్వాత, కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఈవీఎం మిషన్లు పెట్టి ఓట్లను లెక్కిస్తారేమో అనే అనుమానం కలుగుతోందని సందేహం వ్యక్తం చేశారు.