వచ్చే ఏప్రిల్ నుంచి జపాన్ లో పూర్తిగా డిజిటల్ కరెన్సీ
By: Sankar Wed, 02 Dec 2020 05:26 AM
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పేపర్ కరెన్సీకి ఇష్టపడే జపాన్‌లో డిజిటల్ కరెన్సీ అమలుకానుంది. అక్కడి ప్రభుత్వం అందుకోసం ఇప్పటికే చర్యలు చేపట్టింది.
2021 ఏప్రిల్ నెలలో ప్రయోగాత్మకంగా డిజిటల్ యెన్ జారీకి పచ్చజెండా ఇవ్వనుంది. కామన్, ప్రయివేటు డిజిటల్ కరెన్సీ జారీకి 30కి పైగా సంస్థలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. డిజిటల్ యెన్ జారీకి ప్రణాళికలు వేస్తున్నట్లు ఇటీవల జపాన్ కేంద్ర బ్యాంకు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి.
ఫైనాన్షియల్ టెక్నాలజీలో వస్తున్న ఆధునిక మార్పులను అందిపుచ్చుకునే ఆలోచనలో జపాన్ సర్కారు ఉన్నట్లుగా భావిస్తున్నారు. జపాన్‌లో పలు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ఉన్నప్పటికీ నగదు ట్రాన్సాక్షన్స్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతున్నారు. నగదు చెల్లింపులను డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ అధిగమించలేవంటున్నారు. అనేక ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఒకే తరహా ట్రాన్సాక్షన్స్‌కు వీలు కల్పించేందుకు యోచిస్తున్నట్లు తెలిపింది.