- హోమ్›
- వార్తలు›
- జులై ఫస్ట్ వీక్ లో డిగ్రీ పరీక్షలు, జులై 15 నుంచి పీజీ పరీక్షలు నిర్వహించాలని కమిటీ నిర్ణయం
జులై ఫస్ట్ వీక్ లో డిగ్రీ పరీక్షలు, జులై 15 నుంచి పీజీ పరీక్షలు నిర్వహించాలని కమిటీ నిర్ణయం
By: chandrasekar Wed, 10 June 2020 11:32 AM
లాక్ డౌన్ తో వాయిదా పడ్డ
డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను జులై ఫస్ట్ వీక్ లో నిర్వహించాలని ఓయూ స్టాండింగ్
కమిటీ ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. జూన్ 20 నుంచి పరీక్షలు
నిర్వహించాలని ఉన్నత విద్యామండలి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కానీ కరోనా
కేసులు పెరుగుతున్నందున జులై ఫస్ట్ వీక్ లో డిగ్రీ పరీక్షలు, జులై 15 నుంచి
పీజీ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. అప్పటికి కరోనా
వ్యాప్తి అదుపులోకి వస్తేనే పరీక్షలు నిర్వహించాలని లేకుంటే మరోసారి భేటీ నిర్వహించి
నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయానికి వచ్చారు.

కానీ తాజాగా పదో తరగతి
పరీక్షల విషయంలో హైకోర్టు తీర్పుతో పరీక్షలను రద్దు చేసి ఇంటర్నల్ మార్కుల అసెస్‌మెంట్
ద్వారా గ్రేడ్లు కేటాయించి పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించిన విషయం
తెలిసిందే. ఇక డిగ్రీ, పీజీ పరీక్షల విషయంలో కూడా భవిష్యత్తు పరిస్థితులను
బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.