Advertisement

  • ధరణి పోర్టల్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం కెసిఆర్

ధరణి పోర్టల్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం కెసిఆర్

By: Sankar Thu, 31 Dec 2020 11:01 PM

ధరణి పోర్టల్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం కెసిఆర్


ధరణి పోర్టల్‌లో మరిన్ని ఆప్షన్లు పెట్టి, మరింత మెరుగు పరుస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ధరణి పోర్టల్ నిర్వహణ, ఇంకా మెరుగు పర్చాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా స‌మావేశం నిర్వహించారు..

ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ మాట్లాడుతూ వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశ్యంతో తెచ్చిన ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తున్నదని తెలిపారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఎవరి వద్దా పైరవీ చేసుకోవాల్సిన దుస్థితి లేకుండా నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.

రెండు నెలల వ్యవధిలోనే లక్షా 6 వేల మంది ధరణి ద్వారా స్లాట్ బుక్ చేసుకోగా వీరిలో 80 వేల మంది రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకున్నారని సీఎం చెప్పారు..తెలంగాణ రాష్ట్రంలో 90 శాతం మంది రైతులు 5 ఎకరాల లోపు వారే ఉన్నారని, అలాంటి చిన్న రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూములు రిజిస్టర్ చేయించుకుని, మ్యుటేషన్ చేయించుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యమని సీఎం చెప్పారు.

Tags :
|
|

Advertisement