ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కెసిఆర్
By: Sankar Fri, 23 Oct 2020 10:17 PM
ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు... 5.25 శాతం మేర డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
2019 జూలై నుంచి రావాల్సిన ఒక డీఏను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 33.53శాతం నుంచి 38.77 శాతానికి డీఏ పెంచారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన మూడు డీఏల్లో ...రెండింటిపై కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉందన్నారు కేసీఆర్. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ విషయంలో అనుసరిస్తున్న విధానాన్ని మార్చాలని ఈ సందర్భంగా పేర్కొన్న తెలంగాణ సీఎం.. కేంద్రం అంచనాలు తయారు చేసి డీఏ నిర్ణయించే విషయంలో జాప్యం ఉందన్నారు.
ఫలితంగా బకాయిలు పేరుకుపోతున్నాయని తెలిపారు.. 6 నెలలకు ఒకసారి చెల్లించాల్సిన డీఏను రాష్ట్రంలోనే నిర్ణయించాలన్నారు. ప్రతిపాదనలు తయారు చేసి విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు కేసీఆర్.. మొత్తానికి దసరా ముందుకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్.