ఘనంగా సీఎం కెసిఆర్ దత్త పుత్రిక ప్రత్యుషా వివాహం ...
By: Sankar Mon, 28 Dec 2020 11:37 AM
సవతి తల్లి పెట్టిన బాధలను పడలేక చావుబతుకుల మధ్య ఉన్న చిన్నారి ప్రత్యుషను చేరదీసిన సీఎం కెసిఆర్ ..తాజాగా ఆ అమ్మాయికి ఘనంగా పెళ్లి నిర్వహించారు...సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష పెళ్లి ఘనంగా జరిగింది.
సోమవారం ఉదయం 10 గంటలకు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ లూర్ధుమాత చర్చిలో ప్రత్యూష, చరణ్ రెడ్డిలు ఒక్కటయ్యారు. ఈ వేడుకకు షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, మహిళా సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజుతో పాటు పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
ప్రత్యూషకు పెళ్లి కానుకగా సీఎం సతీమణి శోభమ్మ నిన్న అరుదైన బహుమతిని అందజేశారు. ఆదివారం ప్రత్యూషను పెండ్లి కూతురుగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమానికి శోభమ్మ హాజరై ప్రత్యూషకు పట్టువస్ర్తాలు, వజ్రాల నెక్లెస్ బహుకరించి ఆశీర్వదించారు.