Advertisement

ఇద్దరు ఏపీ ఎంపీ లకు కరోనా పాజిటివ్..

By: Sankar Mon, 14 Sept 2020 11:05 AM

ఇద్దరు ఏపీ ఎంపీ లకు కరోనా పాజిటివ్..


ఈరోజు నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జరుగుతున్న సమావేశాలు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.

పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్న సభ్యులు, సిబ్బంది అందరికి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. టెస్టుల్లో నెగెటివ్ వచ్చిన వారిని మాత్రమే పార్లమెంట్ లోకి అనుమతి ఇస్తున్నారు. కాగా, పార్లమెంట్ సభ్యులకు నిర్వహించిన కరోనా టెస్టుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు ఎంపీలకు పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, అరకు ఎంపీ మాధవిలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది.

అయితే, చిత్తూరు ఎంపీ రెడ్డప్పకు ఎలాంటి లక్షణాలు లేకున్నా టెస్టుల్లో పాజిటివ్ గా నిర్ధారణ కాగా, అరకు ఎంపీ మాధవి గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగిన సభ్యులను ఐసోలేషన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు వారాలపాటు తప్పనిసరిగా ఐసోలేషన్లో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

Tags :
|
|
|
|

Advertisement