Advertisement

  • ఏపీ హైకోర్ట్ కొత్త సీజే నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర

ఏపీ హైకోర్ట్ కొత్త సీజే నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర

By: Sankar Thu, 31 Dec 2020 11:25 PM

ఏపీ హైకోర్ట్ కొత్త సీజే నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర


ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ గోస్వామి నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు. ఇందుకు సంబంధించిన గెజిట్‌ను కేంద్ర న్యాయశాఖ గురువారం విడుదల చేసింది.

అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ జస్టిస్‌ జేకే మహేశ్వరీ బదిలీపై కేంద్ర న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి నోటిఫికేషన్‌ జారీ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చల అనంతరం రాష్ట్రపతి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఏపీ హైకోర్టు, సిక్కిం హైకోర్టు అధికారులకు జారీ చేసిన నోటిఫికేషన్‌ వివరాలు ఇందులో పొందుపరిచారు.

సిక్కిం హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించాలని జస్టిస్‌ మహేశ్వరీకి సూచించారు..కాగా జస్టిస్‌ అరూప్‌ గోస్వామి 1961 మార్చి 11న అసోంలోని జోర్హాట్‌లో జన్మించారు. గువాహటి ప్రభుత్వ న్యాయకళాశాల నుంచి 1985లో న్యాయశాస్త్ర పట్టా పొందారు.1985 ఆగస్టు 16న న్యాయవాదిగా తన పేరు నమోదు చేసుకున్నారు.

Tags :

Advertisement