Advertisement

  • సీబీఎస్ఈ 10 మరియు 12వ తరగతి పరీక్షలు మే 4 నుంచి జూన్ 10 వరకు

సీబీఎస్ఈ 10 మరియు 12వ తరగతి పరీక్షలు మే 4 నుంచి జూన్ 10 వరకు

By: chandrasekar Thu, 31 Dec 2020 10:53 PM

సీబీఎస్ఈ 10 మరియు 12వ తరగతి పరీక్షలు మే 4 నుంచి జూన్ 10 వరకు


సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ ఈ) మే 4 నుంచి జూన్ 10 వరకు పదో తరగతి మరియు 12వ తరగతికి బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గురువారం ప్రకటించారు. జూలై 15 నాటికి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అనూహ్య పరిస్థితి కారణంగా ఫిబ్రవరి వరకు ఎలాంటి పరీక్షలు ఉండవని నేను ముందే ప్రకటించాను అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో 10, 12 వ తరగతికి సంబంధించిన బోర్డు పరీక్షలు మే 4 నుంచి జూన్ 10 వరకు జరుగుతాయని నిర్ణయించాము అని పోఖ్రియాల్ తన ట్విట్టర్ ఖాతాలో లైవ్ వీడియో ద్వారా ప్రకటించారు.

పరీక్షల ఫలితాలు జూలై 15లోగా ప్రకటించనున్నారు. అలాగే మార్చి 1 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి అని ఆయన తెలిపారు. టీచర్లతో గతంలో జరిపిన సంభాషణలో జనవరి-ఫిబ్రవరి లో పరీక్షలు నిర్వహించబడదని అయన చెప్పారు. డిజిటల్ డివైస్ ను ఉపయోగిస్తూ పరీక్షలను ఆన్ లైన్ లో నిర్వహించే అవకాశాన్ని కూడా ఆయన తోసిపుచ్చారు. సిబిఎస్ఇ తన నోటిఫికేషన్లో 10 మరియు 12 వ తరగతుల తేదీలను త్వరలో జారీ చేయబడుతుంది అని తెలిపింది. సిబిఎస్ఇ ఎప్పటికప్పుడు పరీక్షకు సంబంధించిన సమాచారం తెలియజేస్తుంది. సిబిఎస్‌ఇ వెబ్‌సైట్‌లో సమాచారం అందుబాటులో ఉంచబడుతుంది.

Tags :
|
|

Advertisement