బీభత్సం సృష్టించిన కారు ..ఒకరు మృతి
By: Sankar Sat, 29 Aug 2020 3:00 PM
నిజామాబాద్ పట్టణంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ సంఘటనలో ఒకరూ మృతి చెందారు. ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీ 28 ఎఎస్ 4150 నెంబర్ కల కారు కపిల హోటల్ వైపు నుంచి నిఖిల్ సాయి హోటల్ వైపు అతి వేగంగా వస్తున్న కారు మార్గం మధ్యలో ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. అక్కడి నుంచి దేవి థియేటర్ మూల మలుపు వద్ద మరో వాహనాన్ని ఢీ కొట్టింది.
మలుపులో ఇద్దరిని ఢీ కొని మలుపు వద్ద ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న జొన్నల వెంకటేష్(27) మృతి చెందారు. జొన్నల అఖిలేష్, జ్ఞానేశ్వర్, స్వామి, ప్రకాష్, రమేష్ అనే మరికొందరు గాయపడ్డారు. మృతుడు రోటరీనగర్‌కు చెందినవాడిగా గుర్తించారు పోలీసులు. అయితే కారు ప్రమాదానికి కారణమైన రవీందర్‌రెడ్డికి ఛాతీలో నొప్పి రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.