- హోమ్›
- వార్తలు›
- నగర వాసుల దాహార్తి తీర్చేందుకు రిజర్వాయర్లు నిర్మిస్తాము ... తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
నగర వాసుల దాహార్తి తీర్చేందుకు రిజర్వాయర్లు నిర్మిస్తాము ... తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
By: Sankar Mon, 16 Nov 2020 08:52 AM
రిజర్వాయర్లు నిర్మించిన నగరవాసుల దాహం తీర్చామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
ఆదివారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని భరత్‌నగర్, ఇందిరమ్మ కాలనీ, వెంకటరెడ్డినగర్, ఆదర్శనగర్, మారుతినగర్ తదితర ప్రాంతాల్లో మంచినీటి రిజర్వాయర్ల ద్వారా నీటి సరఫరాను ప్రారంభించడంతో పాటు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామని అన్నారు. ఏ ఒక్కరూ తాగునీటికోసం ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతో ప్రత్యేకంగా రిజర్వాయర్లను నిర్మించి లో ప్రెషర్ సమస్య లేకుండా చివరి ఇంటివరకు నీరు అందేలా సరఫరా చేస్తున్నామని తెలిపారు.