లారాకు ఇష్టమైన యంగ్ ఆటగాడు అతడే
By: Sankar Mon, 09 Nov 2020 1:37 PM
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా ఇప్పుడు ఉన్న ఇండియన్ యంగ్ క్రికెటర్లలలో తనకు ఎవరు ఇష్టమో ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఐదుగురు యంగ్ క్రికెటర్ల పేర్లు ప్రస్తావిస్తూ వారంటే తనకు ఎందుకు అంత ఇష్టమో పేర్కొన్నారు. లారాకు ఇష్టమైన క్రికెటర్లలో సంజూ సామ్‌సన్ ముందు వరుసలో ఉన్నాడు.
తనకు ఇష్టమైన ప్లేయర్ల గురించి అడగగా ఆయన మొదట సంజూ పేరునే ప్రస్తావించారు. ఐపీఎల్ 2020లో రాజస్తాన్ రాయల్స్ తరుపున ఆడుతున్న సంజూ రెండు మ్యాచ్‌ల్లో 16 సిక్స్‌లు కొట్టి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. అయితే ఆ తరువాత మ్యాచ్‌ల్లో దానిని కొనసాగించలేకపోయాడు. లారా, సంజూ గురించి మాట్లాడుతూ, ‘నాకు సంజూ సామర్థ్యం అంటే చాలా ఇష్టం. అతనికి మంచి టైమింగ్, సామర్థ్యం ఉంది. అతను ఉన్నత స్థాయికి చేరుతాడు’ అని అన్నారు.
ఇక లారాకు ఇష్టమైన మరో క్రికెటర్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతున్న సూర్య కుమార్ యాదవ్. ఈయన ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు ఆడి 461 పరుగులు చేశాడు. సరాసరి 41.90 పరుగులు. ‘ఒక వేళ టీంలో బెస్ట్ ప్లేయర్లు ఓపెనర్లుగా లేనప్పుడు సూర్యకుమార్‌ను నెంబర్ 3గా దించాలి. ఓపెనర్లు ఆడటంలో విఫలమైన ఇతను నిలకడగా ఆడి టీంని గెలిపించే అవకాశాలు ఉన్నాయి’ అని లారా పేర్కొన్నారు.