Advertisement

  • బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సోనారోకి వరుసగా మూడోసారి కరోనా పాజిటివ్

బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సోనారోకి వరుసగా మూడోసారి కరోనా పాజిటివ్

By: Sankar Fri, 24 July 2020 6:30 PM

బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సోనారోకి వరుసగా మూడోసారి కరోనా పాజిటివ్



కరోనా మహమ్మారి దెబ్బకు అగ్ర రాజ్యం అమెరికా , ఇండియాతో పాటుగా కుదేలయిన మరొక దేశం బ్రెజిల్ ..బ్రెజిల్లో కరోనా వచ్చిన కొత్తలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన కేసులు విపరీతంగా నమోదు అయితున్నాయి ..అయితే ఆ దేశ అధ్యక్షుడిని కరోనా వదిలేలా లేదు ..ఇప్పటికే రెండు సార్లు చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ రాగ , ఇప్పుడు చేసిన మూడో పరీక్షలో కూడా పాజిటివ్ ఏ వచ్చింది ..

కొవిడ్‌-19 లక్షణాలతో బాధపడుతున్న ఆయన ఈ నెల 7న పరీక్షలు చేయగా వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో అధ్యక్ష భవనంలోనే స్వీయ నిర్భంధంలో ఉన్నారు. బోల్సొనారో ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, వైద్యులు పరిశీలిస్తున్నారని అధ్యక్ష పరిపాలన భవనం ఒక ప్రకటనలో పేర్కొంది..

గత వారం నిర్వహించిన పరీక్షల్లోనూ పాజిటివ్‌గా వచ్చింది. స్వీయ నిర్బంధంలో ఉన్న సమయంలో బోల్సొనారో అల్పహారం, కాఫీ తీసుకుంటున్న చిత్రాలను ఇటీవల సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. అమెరికా తర్వాత కరోనా కేసుల్లో ప్రపంచంలోనే రెండో బాధిత దేశంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ప్రకారం ఇప్పటి వరకు బ్రెజిల్‌లో 21,67,988 కేసులు నమోదవగా, 14,65,970 మంది కోలుకున్నారు. 6,20,390 మంది చికిత్స పొందుతుండగా, వైరస్‌ ప్రభావంతో 80వేలకుపైగా మృతి చెందారు.

Tags :
|
|
|

Advertisement