తెలంగాణాలో బోనాల ఉత్సవాలు ఘనంగా
By: chandrasekar Wed, 19 Aug 2020 4:10 PM
కరోనా కారణంగా ఈ సంవత్సరం బోనాల ఉత్సవాలకు తక్కువ సంఖ్యలో జనాలు పాల్గొన్నారు. అధిక కట్టుబాట్ల మధ్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. బోనాల ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రానికి ప్రతీక అని ఆర్‌జేడీఎస్‌ఈ విజయలక్ష్మీబాయి, డీఈవో బి.వెంకట నర్సమ్మ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం గన్‌ఫౌండ్రిలోని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో టీఎన్జీవో స్కూల్ ఎడ్యుకేషన్ యూనిట్ అధ్యక్షుడు కేఆర్ రాజ్‌కుమార్, కార్యదర్శి ఎం.భాస్కర్ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఈ ఉత్సవాలకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా కార్యదర్శి దేవేందర్, బాలరాజు, డీఈవో అసిస్టెంట్ డైరెక్టర్ జగన్నాథ్‌లక్ష్మీపతి రెడ్డి, సులోచనలతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూనిట్ ఆధ్వర్యంలో ఐదు బోనాలను అమ్మవారికి సమర్పించారు.
ఉత్సవాల గురించి అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణలో బోనాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నదన్నారు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడు చల్లగా ఉండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నామని వారు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవో స్కూల్ ఎడ్యుకేషన్ యూనిట్ అసోసియేట్ సభ్యులు పాల్గొన్నారు.