స్వీయ నిర్బంధంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్
By: Sankar Thu, 19 Nov 2020 7:07 PM
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నివాసంలో కరోనా కలకలం చెలరేగింది. ఆయన డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో సల్మాన్ కుటుంబం నేడు కోవిడ్ పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ అని తేలడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సల్మాన్, తన కుటుంబంతో కలిసి పద్నాలుగు రోజులపాటు ఇంట్లోనే స్వీయనిర్బంధంలో ఉండనున్నారు. మరోవైపు వైరస్ సోకిన సిబ్బందిని ముంబైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాగా మరికొద్ది రోజుల్లో సల్మాన్ తల్లిదండ్రులు సల్మా ఖాన్(సుశీల చరక్)- సలీమ్ ఖాన్‌పెళ్లిరోజును పురస్కరించుకుని గ్రాండ్ పార్టీ చేద్దామనుకున్నారు. ఇంతలోనే ఇంట్లో ఈ విపత్తు వచ్చిపడటంతో దాన్ని రద్దు చేసే ఆలోచనలో ఉన్నారట...
ఇదిలా వుంటే సల్మాన్ ఖాన్ బిగ్‌బాస్ హిందీ 14వ సీజన్‌ను విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రధాన పాత్రలో నటించిన 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్' చిత్రం ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దిశా పటానీ, రణ్‌దీప్ హుడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు