నా ప్రాణానికి ముప్పు ఉంది ..వై కేటగిరి భద్రత కలిపించండి..పాయల్ ఘోష్
By: Sankar Tue, 29 Sept 2020 8:32 PM
బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీని కలిశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో తనకు వై కేటిగిరీ భద్రతను కల్పించాలని పాయల్ ఘోష్ గవర్నర్ ను కోరారు. ఈ మేరకు పాయల్ ఘోష్ గవర్నర్ కు ఓ లేఖ అందజేశారు.
తన ప్రాణానికి ముప్పు ఉందని, తనకు వై కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలుపుతూ..గౌరవనీయులైన మహారాష్ట్ర గవర్నర్ కొష్యారీతో సమావేశం గొప్పగా జరిగింది. ఆయన నాకు మద్దతు తెలిపారు. విమర్శించేవారు, అభ్యంతరం తెలిపేవాళ్లు, వ్యతిరేకించే వాళ్లున్నారు. కానీ నేను అస్సలు ఆగను. ముందుకెళ్తానని ట్వీట్‌చేశారు పాయల్.
పాయల్ వెంట లాయర్ నితిన్ సాత్పుటేతోపాటు రాజ్యసభ ఎంపీ రాందాస్ అథవాలే కూడా ఉన్నారు. పాయల్ ఘోష్ ఫిర్యాదుతో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ పై ముంబై పోలీసులు రేప్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.