- హోమ్›
- వార్తలు›
- రజినీకాంత్ అంటే మా పార్టీకి ఎంతో గౌరవం ఉంది ...తమిళనాడు బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి
రజినీకాంత్ అంటే మా పార్టీకి ఎంతో గౌరవం ఉంది ...తమిళనాడు బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి
By: Sankar Wed, 30 Dec 2020 1:08 PM
రజినీకాంత్ గొప్ప నాయకుడని తమిళనాడు బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి సీటీ రవి కొనియాడారు. ఆయనంటే తమ పార్టీకి ఎంతో గౌరవం ఉందని చెప్పారు.
రజినీకాంత్ ఎప్పుడు కూడా దేశ ప్రయోజనాలను, తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం కృషిచేశారని సీటీ రవి పేర్కొన్నారు. తమిళనాడులో మరో ఆరో నెలల్లో ఎన్నికలు జరుగనున్ననేపథ్యంలో.. తానూ రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నానని రజినీకాంత్ ప్రకటించారు.
అయితే ఇటీవల ఆయన తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. మూడు రోజుల తర్వాత హైదరాబాద్‌లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ క్రమంలో మంగళవారం రజినీకాంత్ మరో ప్రకటన చేశారు. అనారోగ్య కారణాల రీత్యా తాను రాజకీయాల్లోకి రావడంలేదని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీటీ రవి.. రజినీకాంత్‌ను ఉద్దేశించి తాజా వ్యాఖ్యలు చేశారు.