Advertisement

  • సీఎం కెసిఆర్ పై విమర్శలు గుప్పించిన బీజేపీ ఎంపీ బండి సంజయ్

సీఎం కెసిఆర్ పై విమర్శలు గుప్పించిన బీజేపీ ఎంపీ బండి సంజయ్

By: Sankar Sun, 20 Dec 2020 9:56 PM

సీఎం కెసిఆర్ పై  విమర్శలు గుప్పించిన బీజేపీ ఎంపీ బండి సంజయ్


రైతుల మీద ప్రేమ ఉంటే ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులను సీఎం కేసీఆర్ ఎందుకు కలవలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు.

ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ తన ఫాం హౌస్‌లో పండించిన పంట ఎవరికి అమ్మారో సమాధానం చెప్పాలన్నారు. నాగార్జునసాగర్‌లో కూడా బీజేపీ గెలుస్తుందని, ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్లు, అచ్చంపేట మున్సిపాలిటీ బీజేపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కుటుంబ, అరాచక పాలనను అంత మొందిస్తామని.. రాష్ట్ర ప్రజలు మార్పును కోరుతున్నారని.. అది బీజేపీ వల్ల సాధ్యమని ప్రజలకు తెలుసన్నారు. సారు కారు ఇక రారని... రాష్ట్రంలో మంత్రులందరూ రబ్బరు స్టాంప్ లు అయ్యారని ఎద్దేవా చేశారు. బీజేపీ అంటే ముఖ్యమంత్రికి భయమని... బీజేపీ ఏ మతానికి వ్యతిరేకం కాదన్నారు.

Tags :
|
|
|

Advertisement