బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు కరోనా పాజిటివ్
By: Sankar Sun, 13 Dec 2020 7:22 PM
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా రాజకీయ నేతలు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరోనా బారిన పడ్డారు.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందని ఆయనవెల్లడించారు. “కరోనా వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే కరోనా టెస్టు చేయించుకున్నాను. ఫలితం పాజిటివ్ అని వచ్చింది.
వైద్యుల సలహా మేరకు అన్నికరోనా మార్గదర్శకాలను పాటిస్తూ హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్నాను. నా ఆరోగ్యం బాగుంది. గత కొద్ది రోజులుగా నన్ను కాంటాక్ట్ అయిన వారు, దగ్గరగా మెలిగిన వారు టెస్టులు చేయించుకోవాలని, జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను” అని జేపీ నడ్డా ట్విట్టర్ ద్వారా కోరారు.
Tags :
jp nadda |
tested |
positive |