మరికొద్దిసేపట్లో బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్
By: Sankar Sun, 20 Dec 2020 5:24 PM
బిగ్‌బాస్ నాల్గో సీజన్ కథ క్లైమాక్స్‌కు వచ్చింది. విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? అనేది నేడు తేల్చనున్నారు. ఈ సీజన్‌లో ఊహించని ఎలిమినేషన్లు ఇస్తూ ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ విజేతను ప్రకటించే విషయంలో ఏం ఎలాంటి ట్విస్టు ఇవ్వనున్నాడోనని నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
సుదీర్ఘంగా సాగనున్న ఈ గ్రాండ్ ఫినాలే షూటింగ్ మొదటి పార్ట్ శనివారమే ముగిసింది. ఇందులో ముద్దుగుమ్మల డ్యాన్సులు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల స్పెషల్ పర్ఫామెన్సులతో ఎంటర్‌టైన్‌మెంట్ పార్ట్ చిత్రీకరణ ముగిసింది. నేడు విన్నర్‌ను ప్రకటించే అసలు సిసలైన ఘట్టం షూటింగ్ జరగనుంది. దీనికి స్పెషల్ గెస్ట్‌లు ఎవరొస్తున్నారనేది సస్పెన్స్‌గా ఉంచారు.
అయితే ఫైనల్ కంటెస్టెంట్స్ గా అభిజీత్ , అఖిల్ , అరియనా , సోహెల్ , హారిక ఉన్నారు..మరి ఈ అయిదుగురులో ఎవరు విన్నర్ అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది ..అనధికారికంగా వస్తున్న వార్తల ప్రకారం అభిజీత్ విన్నర్ అయినట్లు తెలుస్తుంది...