అరియానాను గెలిపించుకుందాం ...దేవి నాగవెల్లి
By: Sankar Mon, 14 Dec 2020 5:50 PM
బిగ్ బాస్ సీజన్ ఫోర్ చివరి వారానికి చేరుకుంది ..చివరగా అయిదుగురు సభ్యులు బిగ్ బాస్ టైటిల్ కోసం గ్రాండ్ ఫినాలే లోకి వెళ్లారు ..వారే అభిజీత్ , అరియనా , అఖిల్ , సోహెల్, హారిక ..ఈ ఐదుగురిలో ముగ్గురు అబ్బాయిలు కాగా ఇద్దరు అమ్మాయిలు ..అయితే గత మూడు సీజన్లలో కూడా అబ్బాయిలే బిగ్ బాస్ విజేతలుగా నిలిచారు ..అయితే ఈ సారి ఎలాగయినా అమ్మాయిని బిగ్ బాస్ విన్నర్ గా చూడాలనుకుంటుంది ..ప్రముఖ యాంకర్ , ఈ ఏడాది బిగ్ బాస్ కంటెస్టెంట్ నాగవెల్లి ...
అరియానా ఎవరి అండదండలు లేకుండానే హౌస్‌లో పద్నాలుగు వారాల జర్నీ పూర్తి చేసుకుని ఫైనల్‌కు చేరుకుంది. ఈ సమయంలో దేవి నాగవల్లి ఆమెకు అండగా నిలబడింది. ఇచ్చిన మాట ప్రకారం అమ్మాయి విన్నర్ అవ్వాలన్న కలను సాకారం చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తోంది.
అరియానాను గెలిపించాల్సిన సమయం ఆసన్నమైందని సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఆమెను రక్షించుకుందామంటూ అభిమానులకు పిలుపునిచ్చింది. ఈ ఒక్క పోస్టుతో అరియానా అభిమానులకు కొండంత బలం వచ్చినట్లైంది. లేడీ ఫైటర్‌కు సపోర్ట్ ఇచ్చినందుకు ఆమె అభిమానులు దేవికి ధన్యవాదాలు తెలుపుతున్నారు