బీసీసీఐ ని వదలని కరోనా ..తాజాగా బీసీసీఐ మెడికల్ టీం సభ్యుడికి పాజిటివ్
By: Sankar Thu, 03 Sept 2020 1:29 PM
ఇండియాలో కరోనా కేసులు భారీ స్థాయిలో ఉన్నాయి అని ఐపీయల్ నిర్వహణ కోసం ఏ వరకు వెళ్లిన బీసీసీఐ ని అక్కడ కూడా కరోనా వదిలేలా లేదు..ఇప్పటికే చెన్నై జట్టులో చాల మంది కరోనా భారిన పడిన విషయం తెలిసిందే..ఇప్పుడు బీసీసీఐ మెడికల్ టీమ్‌లోని సభ్యునికి కరోనా సోకింది. ఈ విషయాన్ని బీసీసీఐ ధృవీకరించింది. ఐపీఎల్ కోసం యూఏఈకి వెళ్లిన తర్వాత 13 మంది సీఎస్‌కే సభ్యులు కరోనా బారిన పడ్డారు. కాగా, రెండు రోజుల క్రితం నిర్వహించిన టెస్టుల్లో వారికి కరోనా నెగిటివ్ రావడంతో సీఎస్‌కే ఊపిరి పీల్చుకుంది.
అయితే ఇప్పుడు బీసీసీఐ మెడికల్ టీమ్ సభ్యుడికి కరోనా రావడంతో మరోసారి కలవరం మొదలైంది. ఇదిలాఉంచితే, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో ఉన్న ఇద్దరు సభ్యలకు కరోనా సోకిన విషయాన్ని సైతం బోర్డు సీనియర్ అధికారి ప్రకటించారు. ‘ దుబాయ్‌లో ఉన్న బీసీసీఐ సీనియర్ మెడికల్ ఆఫీసర్‌కు కరోనా సోకిన విషయం నిజమే.
కానీ ప్రస్తుతం ప్రాబ్లం ఏమీ లేదు. అతను ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఎవరితోనూ అతని కాంటాక్ట్ లేదు. యూఏఈకి వెళ్లే సమయంలో కూడా ఏ క్రికెటర్‌తోనే అతను కాంటాక్ట్ కాలేదు. ఆ మెడికల్ ఆఫీసర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. తదుపరి టెస్టుల నాటికి అతనికి నెగిటివ్ వస్తుందని ఆశిస్తున్నాం. ఎన్‌సీఏలో ఇద్దరి సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది’ అని సదరు అధికారి వెల్లడించారు.