భారత క్రికెట్ జట్టు కిట్ స్పాన్సర్ గా ఎంపిఎల్...
By: Sankar Wed, 18 Nov 2020 4:33 PM
భారత క్రికెట్ జట్టుకు కిట్ స్పాన్సర్‌గా ప్రఖ్యాత స్పోర్టింగ్ కంపెనీ ‘నైకీ’ 15 ఏళ్ల బంధం అధికారికంగా ముగిసింది. టీమిండియా కిట్ అండ్ మర్కండైజ్ స్పాన్సర్‌గా ఎంపీఎల్ స్పోర్ట్స్ అపెరల్ అండ్ యాక్సెసరీస్‌తో బీసీసీఐ తాజాగా ఒప్పం దం కుదుర్చుకుంది.
ఇ–స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ అయిన మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్)కు చెందినదే ఈ ఎంపీఎల్ స్పోర్ట్స్. ఇకపై భారత సీనియర్ పురుషుల, మహిళల జట్లు, అండర్–19 టీమ్‌ల జెర్సీలపై ‘ఎంపీఎల్’ లోగో కనిపిస్తుంది. నవంబర్ 27 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే తొలి వన్డే నుంచి ఈ ఒప్పందం అమల్లోకి రానుండగా... 2023 డిసెంబర్ వరకు మూడేళ్ల కాలానికి ఎంపీఎల్–బీసీసీఐ భాగస్వామ్యం కొనసాగుతుంది.
టీమిండియా అధికారిక జెర్సీలతో పాటు ఇతర క్రీడా సామగ్రిని అమ్ముకునేందుకు కూడా ఎంపీఎల్‌కు హక్కులు లభిస్తాయి. బెంగళూరు కేంద్రంగా పని చేసే ఈ గేమింగ్ కంపెనీలో గరిమెళ్ల సాయి శ్రీనివాస్ కిరణ్, శుభమ్ మల్హోత్రా భాగస్వాములు.