సూర్య కుమార్ ఒక్కడే కాదు ...చాల మంది మెరిశారు ..బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ
By: Sankar Thu, 05 Nov 2020 3:57 PM
ఈ ఐపీఎల్ సీజన్‌లో పలువురు యువ క్రికెటర్లు వెలుగులోకి రావడంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ హర్షం వ్యక్తం చేశాడు. ప్రధానంగా ఆరుగురు టాలెంటెడ్ ప్లేయర్స్ తమకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నారన్నాడు.
ప్రస్తుత సీజన్‌తో ఏ ఒక్క ఆటగాడో వెలుగులోకి రాలేదని, యువ క్రికెటర్ల బెంచ్‌లో చాలామంది ఆకట్టుకోవడం మంచి పరిణామమన్నాడు. సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, వరుణ్ చక్రవర్తి, శుబ్‌మన్ గిల్, సంజూ శాంసన్, దేవదూత్ పడిక్కల్‌లు తమలోని సత్తాను నిరూపించుకున్నారన్నాడు. సూర్యకుమార్ యాదవ్‌కు భారత జట్టులో చోటు దక్కలేదనే నేపథ్యంలో గంగూలీ స్పందించాడు.
హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ఈ ఐపీఎల్ కేవలం సూర్యకుమార్ యాదవ్ మాత్రమే ఆకట్టుకోలేదని, చాలామంది యువ క్రికెటర్లు మెరిశారన్నాడు. దాంతో భారత క్రికెట్ జట్టులో కొంతమంది యంగ్ క్రికెటర్లకు చోటు దక్కిందన్నాడు. ఇక సూర్యకుమార్‌కు చాన్స్ ఇవ్వలేదనే వ్యాఖ్యల్ని గంగూలీ తనదైన శైలిలో దాటవేశాడు. సూర్యకుమార్ యాదవ్ సమయం కూడా వస్తుందన్నాడు