IPL 2020: దుబాయ్ వేదికగా నవంబర్ పదిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్...!
By: Anji Mon, 26 Oct 2020 12:09 PM
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరుగుతున్న ఐపీఎల్ టోర్నీ ప్లే ఆఫ్ షెడ్యూల్ ఖరారయ్యింది.. ఇంతకు ముందు షెడ్యూల్‌లో కేవలం లీగ్ దశ మ్యాచ్‌లను వెల్లడించారు ఐపీఎల్ నిర్వాహకులు.. ఇప్పుడు ప్లే ఆఫ్స్ షెడ్యూల్‌ను, వేదికలను ఖరారు చేశారు..
నవంబర్ మూడున లీగ్ దశలో మ్యాచ్‌లు ముగుస్తాయి.. నవంబర్ నాలుగున విశ్రాంతి దినం.. ఆ మరుసటి రోజు అంటే నవంబర్ అయిదున క్వాలిఫయర్ వన్ మ్యాచ్ జరుగుతుంది.. ఈ మ్యాచ్‌కు దుబాయ్ ఆతిథ్యమిస్తోంది.
పాయింట్ల టేబుల్‌లో అగ్రభాగాన ఉన్న రెండు జట్ల మధ్య క్వాలిఫయర్ వన్ మ్యాచ్ జరుగుతుంది.. నవంబర్ ఆరున ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది.. అబుదాబిలో జరిగే ఈ మ్యాచ్‌లో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న జట్టుతో నాలుగో ప్లేస్‌లో ఉన్న టీమ్ పోటీపడుతుంది.
ఇక క్వాలిఫయర్-2లో క్వాలిఫయర్ వన్‌లో ఓడిన జట్టుతో ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పోటీపడుతుంది.. ఫైనల్ మ్యాచ్ నవంబర్ పదిన దుబాయ్ వేదికగా జరుగుతుంది.
ఇందులో క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్ -2లో గెలిచిన జట్టు పోటీపడుతుంది.. షార్జాలోప్రస్తుతం మహిళల టీ-20 ఛాలెంజ్ కప్ జరుగుతోంది.. అందుకే అక్కడ ప్లే ఆఫ్ మ్యాచ్‌లు జరగడం లేదు..