Advertisement

  • తాము గల్లీ లీడర్లమే గానీ గడీల నేతలం కాదు ..బండి సంజయ్

తాము గల్లీ లీడర్లమే గానీ గడీల నేతలం కాదు ..బండి సంజయ్

By: Sankar Tue, 23 June 2020 1:37 PM

తాము గల్లీ లీడర్లమే గానీ గడీల నేతలం కాదు ..బండి సంజయ్కరోనా వలన తెలంగాణ రాజకీయాలలో తెరాస , బీజేపీ మధ్య మతాల యుద్ధం ఆగేలా లేదు ..ప్రజల బాగోగులు చూసుకోవాల్సిన సమయంలో ఈ రెండు ప్రధాన పార్టీలు ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు ..బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తెలంగాణలో కరోనా టెస్ట్ లు చేయడం లేదు అని , కరోనాను కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం అయిందిఅని విమర్శలు గుప్పించాడు .అయితే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ జాతీయ స్థాయి నాయకుడు అయినా జెపి నడ్డా గల్లి స్థాయి నాయకుడి మాదిరిగా కూడా మాట్లాడటం లేదు అని విమర్శించాడు ..

అయితే తాజాగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ తాము గల్లీ లీడర్లమేగానీ గడీల నేతలం కాదని మంత్రి ఈటల రాజేందర్‌కు స్పష్టం చేశారు .. తాము గులాబీ జెండా ఓనర్లమంటూ మంత్రి ఈటల గతంలో చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘‘ఇప్పుడు జరుగుతున్నది బండి ఓనర్లకు, క్లీనర్లకు మధ్య పంచాయితీ కాదు.. డాక్టర్లను, రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలను కాపాడుకునే పంచాయితీ.. సంస్కారం గురించి మాట్లాడే ముందు మీ ఓనర్‌(సీఎం)కు సంస్కారం నేర్పండి. దేశంలో బూతు పురాణం మాట్లాడే ఏకైక ముఖ్యమంత్రి తెలంగాణలోనే ఉన్నరు’’ అని విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్‌ అసమర్థత వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలను కూడా ఆయన కాపాడుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.

కరోనా నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బీజేపీ నాయకులు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల ఎదుట నిరసనలు చేశారు. కోఠిలోని కరోనా కంట్రోల్‌ సెంటర్‌ వద్ద నిరసనకు దిగిన సంజయ్‌తోపాటు మాజీ మంత్రులు విజయరామారావు, పెద్దిరెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ తక్షణమే టిమ్స్‌ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ను అమలు చేయాలని, కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. పారాసిటమాల్‌తో కరోనా పరారవుతుందని చెప్పిన సీఎం మాటలను తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రస్తావిస్తే సద్విమర్శగా తీసుకోకుండా ఆరోగ్యమంత్రితో మాటల దాడి చేయించడం సమంజసం కాదన్నారు. గాంధీ ఆస్పత్రి ముందు ధర్నా కోసం బయల్దేరిన లక్ష్మణ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ ఆస్పత్రికి పోవడం కంటే శ్మశానానికి పోవడం మేలని ప్రజలు భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Advertisement