Advertisement

హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు నిషేధం ...

By: Sankar Fri, 25 Dec 2020 3:46 PM

హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు నిషేధం ...


కరోనా నేపథ్యంలో నూతన సంవత్సర‌ వేడుకలకు అనుమతి లేదని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి లేదని, పబ్స్‌, రిసార్ట్స్‌, హోటల్స్‌పై పటిష్ట నిఘా ఉంటుందని ఆయన తెలిపారు.

ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి వేడుకలు చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సజ్జనార్‌ సూచించారు గేటెడ్‌ కమ్యూనిటీ, అపార్ట్‌మెంట్‌ కాలనీల్లోనూ వేడుకలు నిషిద్ధం అని పేర్కొన్నారు. డ్రంకన్‌ డ్రైవ్‌ టెస్టులు చేస్తున్నామని, ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు..

కాగా కరోనా మహమ్మారి తగ్గుతుంది అని అందరు భావిస్తున్న తరుణంలో మరొక కొత్త వైరస్ ప్రపంచం మీద దాడికి సిద్దమయింది ..దీనితో కరోనా మహమ్మారి సమయంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా ఈ సారి చాల జాగ్రత్త పడుతున్నారు ..అందులో భాగంగానే ప్రపంచంలోని చాల దేశాలు క్రిస్మస్ , న్యూ ఇయర్ వేడుకల మీద నిషేధాలు విధిస్తున్నాయి..

Tags :
|
|

Advertisement