పెంపుడు కుక్కలకోస౦ బీమాని అందుబాటులోకి తెచ్చిన బజాజ్ అలియాంజ్
By: chandrasekar Thu, 27 Aug 2020 10:18 AM
పెంపుడు కుక్కల కోసం ప్రైవేట్ రంగ జీవిత బీమాయేతర సంస్థ బజాజ్ అలియాంజ్ ఓ బీమా పాలసీని అందుబాటులోకి తెచ్చింది. దీనిలో మరణానంతర ప్రయోజనాలు, ప్రమాద బీమా, ఆస్పత్రిలో వైద్యం తదితర కవరేజి అంశాలున్నాయి.
పాలసీ కొన్న తొలి రోజు నుంచే బీమా వర్తిస్తుందని సంస్థ తెలిపింది. 3
నెలల నుంచి పదేండ్ల మధ్యగల ఏదైనా పెంపుడు కుక్క కోసం ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ తపన్ సింఘాల్ చెప్పారు.
రూ.315తో ప్రీమియం మొదలవుతుందని, పాలసీ కోసం కుక్కకు వైద్య పరీక్షలేవీ కూడా అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే పెంపుడు కుక్కల అమ్మకందారులు, ర్యాంప్ షో నిర్వాహకుల వంటి వారికి ఈ పాలసీలను వర్తించవని సంస్థ పేర్కొంది.
Tags :
launches |
for pet |