ఎంఐఎం చీఫ్ కు నిరసన సెగ
By: Sankar Mon, 23 Nov 2020 9:29 PM
ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి నిరసన సెగ తాకింది... రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరద సహాయం తమకు అందలేదని ఒవైసీని మహిళలు నిలదీశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థుల తరపున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఒవైసీ... ఇవాళ.. జాంబాగ్ డివిజన్‌లో ఎంఐఎం అభ్యర్థి రవీందర్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.. అయితే, తాము కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా.. ఎన్నికల సమయంలో ఎలా ఓట్లు అడుగుతారని నిలదీశారు స్థానిక మహిళలు..
దీంతో.. వారికి సమాధానం ఇవ్వకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు ఎంఐఎం చీఫ్. కాగా, హైదరాబాద్‌ను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి.. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో నానా ఇబ్బందులు పడ్డారు ప్రజలు... ప్రకృతి విలయంతో సర్వం కోల్పోయారు.. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేలు కూడా అందరికీ అందకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు