నటరాజన్ బౌలింగ్‌కు ఆస్ట్రేలియా దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ ఇంప్రెస్ అయ్యాడు...!
By: Anji Mon, 07 Dec 2020 7:29 PM
భారత యువ సంచలనం నటరాజన్ బౌలింగ్‌కు ఆస్ట్రేలియా దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ ఇంప్రెస్ అయ్యాడు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో కామెంట్రీ చెబుతున్న మెక్‌గ్రాత్.. ఆసీస్ గడ్డ మీద అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన నటరాజన్‌పై ప్రశంసలు గుప్పించాడు.
నెట్ బౌలర్‌గా భారత జట్టుతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిన నటరాజన్.. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయపడటంతో టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు.
తొలి రెండు వన్డేల్లో భారత్ ఓడటం.. పేసర్ నవదీప్ సైనీ ఆకట్టుకోలేకపోవడంతో.. నటరాజన్‌కు చివరి వన్డే ఆడే అవకాశం దక్కింది.
టీ20ల కంటే ముందే చివరి వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన నట్టూ రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో గెలిచిన భారత్ సిరీస్ కోల్పోయినా.. 1-2 తేడాతో పరువు నిలుపుకుంది.
టీ20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన నట్టూ.. రెండు వికెట్లను ఖాతాలో వేసుకొని భారత్ తరఫున ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
‘నటరాజన్ ఆకట్టుకున్నాడు. ఈ టూర్లో భారత్‌కు లభించిన ఆణిముత్యం అతడు. నట్టూ మిగతా మ్యాచ్‌ల్లోనూ ఇదే ప్రదర్శన కొనసాగిస్తాడని ఆశిస్తున్నాన’ని రెండో టీ20 సందర్భంగా మెక్‌గ్రాత్ వ్యాఖ్యానించాడు.
కొన్నేళ్ల క్రితం భారత్‌లోని ఎంఆర్ఎఫ్ పేస్ అకాడమీలో నటరాజన్‌తో కలిసి పని చేశానని మెక్‌గ్రాత్ తెలిపాడు. ఆసీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 4 ఓవర్లలో నటరాజన్ కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశారు.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 194 పరుగులు చేసింది. నట్టూ పొదుపుగా బౌలింగ్ చేయడంతో కంగారూలు 200లోపు పరుగులకే పరిమితమయ్యారు. ఈ లక్ష్యాన్ని భారత్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే చేధించి సిరీస్‌ను గెలుచుకుంది.