భూపాలపల్లి జిల్లాలో దారుణం...
By: chandrasekar Tue, 15 Dec 2020 10:28 PM
ఒక దుకాణ యజమాని నలుగురు
పిల్లలను చెట్టుకు కట్టేసి కొట్టిన వైనం భూపాలపల్లి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
ఈ దారుణమైన ఘటన మద్దులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మహదేవపూర్ మండలంలో ఉన్న
మద్దులపల్లి గ్రామంలోని కిరాణా షాపులో నలుగురు చిన్నపిల్లలు వస్తువులు
దొంగిలించారని షాపు యజమాని ఆ నలుగురు చిన్నపిల్లలను చెట్టుకు కట్టేసి కొట్టాడు.
పిల్లల తల్లిదండ్రులు, స్థానికులు
అక్కడికి చేరుకుని ఆందోళన చేసారు. చిన్నపిల్లలు తెలియక చేసిన తప్పుకు క్షమించి
వదిలేయక మానవత్వం మరిచి పోయిన ఒక వ్యక్తి చిన్న పిల్లల పట్ల అమానుషంగా
వ్యవహరించాడు. నాలుగు చెట్లకి ఒకే తాడుతో పిల్లల్ని కట్టేయడం చూసి వారి తల్లిదండ్రులు
దుకాణ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు తెలియక తప్పు చేస్తే చెట్టుకు
కట్టేసి కొట్టడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం పోలీసులకు చెబుతామని వారు అన్నారు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.