ప్రతి ఇంటికి కరోనా పరీక్షలు ..అరవింద్ కేజ్రీవాల్
By: Sankar Wed, 24 June 2020 3:54 PM
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జులై 6 నాటికి ఢిల్లీలోని ప్రతి ఇంటికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం బుధవారం అధికారులను ఆదేశించింది. దేశంలో కరోనా వైరస్ అధికంగా ఉన్న రాష్ట్రాలలో ఢిల్లీ రెండవ స్థానంలో ఉంది. అంతేగాక గడిచిన 24 గంటలలో అత్యధికంగా 3, 947 కేసులు నమోదయ్యాయి. దీంతో కంటైన్మెంట్ జోన్లలోని ప్రతి ఇంటిలో తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
ఢిల్లీలో ప్రతిరోజూ 2,500లకు పైగా కొత్త కేసులు నమోదవుతుండగా దాదాపు 75 మరణాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిలో 45 శాతం కేసులు కంటైన్మెంట్ జోన్లలోనే నమోదవుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. కాగా కరోనా పాజిటివ్ వ్యక్తులు తప్పనిసరిగా కోవిడ్-19 సంరక్షణ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంట్లోనే ఐసోలేషన్ సౌకర్యం ఉన్నవారు హోంక్వారంటైన్‌లో ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఇక ఆరోగ్య సేతూ యాప్‌ను పర్యవేక్షించడానికి.. కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ప్రత్యేకంగా ఐటీ నిపుణులను ప్రభుత్వం నియమించింది. కాబట్టి ఇకపై ఆరోగ్య సేతూ యాప్‌ను ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్ చేసుకోవాలని ముఖ్యంగా చెత్త ప్రభావిత పరిసరాల్లోని తప్పసరి అని ప్రభుత్వం ఆదేశించింది.
అంతేగాక సీసీ కెమారాల ఆధారం పోలీసులు కంటైన్మెంట్ జోన్‌ల కదలికను నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. సవరించిన మార్గదర్శకాల ప్రకారం ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వం చెప్పింది. రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌కు ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తారు. ఇక జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ వ్యక్తులనుకోవిడ్-19 సంరక్షణ కేంద్రాలకు పంపించే ఏర్పాట్లు చేయడంతో పాటు కంటైన్మెంట్ జోన్‌లో 5 నుంచి 10 రోజుల మధ్య కరోనా పరీక్షలు జరుపుతారు.