ఏపీలో కొత్త కరోనా కేసులు ఎన్నో తెలుసా !
By: Sankar Fri, 25 Dec 2020 6:55 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 56,409 మందికి కరోనా పరీక్షలు చేయగా 355 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,80,430కు చేరింది.
నిన్న ఒక్క రోజే కరోనా నుంచి కోలుకుని 354 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మొత్తం 8,69,478 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,861. వైరస్ బాధితుల్లో కొత్తగా ఇద్దరు మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 7,091కి చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ శుక్రవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా కొత్త కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది...కొత్త కరోనా వైరస్ బ్రిటన్ లో ఎక్కువగా ఉండటంతో బ్రిటన్ నుంచి ఏపీకి వచినవారిపై నిఘా పెట్టింది ప్రభుత్వం..