ఏపీలో కొత్తగా 326 కరోనా పాజిటివ్ కేసులు
By: Sankar Tue, 29 Dec 2020 8:02 PM
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 50,794 కరోనా పరీక్షలు నిర్వహించగా, 326 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది.
దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 881599కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది..గడచిన 24 గంటల్లో కరోనా బారిన పడి అనంతపురం, కృష్ణాలో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మరణించారు. ఇప్పటివరకు కరోనాతో 7100 మంది మృతి చెందారు.
గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని క్షేమంగా 364 డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 871116 డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 3,383 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. నేటి వరకు 1,17,08,678 శాంపిల్స్‌ను పరీక్షించారు..ఇక జిల్లాల వారీగా చూసుకుంటే కృష్ణ జిల్లాలో అత్యధికంగా 67 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి ..ఇక అత్యల్పంగా విజయనగరంలో రెండు కేసులు నమోదు అయ్యాయి..