ఏపీ పాలిసెట్ -2020 ఫలితాలు విడుదల
By: Sankar Fri, 09 Oct 2020 5:06 PM
ఆంధ్రప్రదేశ్‌లో పాలీసెట్-2020 పరీక్షా ఫలితాలు విడుదల చేశారు.. పాలీసెట్-2020 ఫలితాలను ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్పెషల్ సీఎస్ అనంతరాము, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ ఎం ఎం నాయక్ విడుదల చేశారు..
ఈ ఏడాది 71, 631 మంది పాలిటెక్నిక్ పరీక్షలకు హాజరుకాగా.. 60,780 మంది ఉత్తీర్ణత సాధించారు.. అందులో.. 42,313 మంది బాలురు, 18,467 బాలికలు ఉత్తీర్ణులయ్యారు.. ఇక, పాలీసెట్ రాసిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థలందరూ ఉత్తీర్ణత సాధించారు.. 9,293 మంది ఎస్సీ, 2,972 మంది ఎస్సీ అభ్యర్థులు పాలీసెట్ రాయగా.. అంతా పాస్ అయ్యారు.
మొత్తం 66,742 సీట్లు అందుబాటులో ఉన్నాయి.. 84 ప్రభుత్వ కాలేజీల్లో 16,155 సీట్లు.. రెండు ఎయిడెడ్ కాలేజీల్లో 598 సీట్లు.. 185 ప్రైవేట్ కాలేజీల్లో 49,989 సీట్లు సిద్ధంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.. మరోవైపు ఇవాళ్టీ నుంచే పాలిటెక్నిక్ సీట్ల కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించారు.. ఈ నెల 20వ తేదీన సీట్లను ప్రకటించనుంది సాంకేతిక విద్యా శాఖ.. వచ్చే నెల మొదటి వారంలో పాలిటెక్నిక్ తరగతులు ప్రారంభంకానున్నాయి.