Advertisement

కరోనా టెస్టుల ధరలను తగ్గించిన ఏపీ ప్రభుత్వం

By: Sankar Thu, 27 Aug 2020 4:25 PM

కరోనా టెస్టుల ధరలను తగ్గించిన ఏపీ ప్రభుత్వం


ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా టెస్ట్ ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రభుత్వం పంపిన శాంపిల్స్ టెస్ట్‌కు రూ.2400 ఉన్న ధరను రూ.1600కు కుదిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ప్రైవేట్‌గా ల్యాబ్స్‌లో టెస్ట్ కోసం గతంలో నిర్దేశించిన రూ.2900 ధరను రూ.1900 కుదిస్తూ ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. టెస్ట్ కిట్లు పెద్ద ఎత్తున అందుబాటులోకి రావటంతో కిట్లు ధర తగ్గిందని ప్రభుత్వం తెలిపింది. తగ్గిన ధరల ద్వారా వచ్చే ప్రయోజనాలను ప్రజలకు అందించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ సర్కార్‌ ఉత్తర్వుల్లో పేర్కొంది.

గత 24 గంటల్లో 61,838 మందికి కరోనా వైరస్‌ పరీక్షలు చేయగా 10,830 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,82,469కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. కరోనా నుంచి కోలుకుని నిన్న ఒక్కరోజే 8,473 మంది డిశ్చార్జ్‌ అవ్వగా, మొత్తం 2,86,720 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 81 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 92,208 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 34,18,690 మందికి కరోనా పరీక్షలు చేశారు.

Tags :
|
|
|

Advertisement