ఐఎన్ఎస్ కోరా యుద్ధ నౌక పరీక్షించిన యాంటీ షిప్ మిస్సైల్
By: chandrasekar Sat, 31 Oct 2020 3:44 PM
హైదరాబాద్: క్షిపణి పరీక్షలతో
భారతీయ నౌకాదళం తన సత్తా ప్రదర్శిస్తున్నది. తాజాగా ఐఎన్ఎస్ కోరా యుద్ధ నౌక
నుంచి యాంటీ షిప్ మిస్సైల్‌ను పరీక్షించారు.
గరిష్ట దూరంలో ఉన్న టార్గెట్‌ను అత్యంత ఖచ్చితత్వంతో పేల్చేశారు. ఈ పరీక్ష
బంగాళాఖాతంలో జరిగింది. టార్గెట్ షిప్ తీవ్రంగా ధ్వంసమైందని, ఆ నౌక
నుంచి మంటలు వ్యాపించినట్లు నౌకాదళ ప్రతినిధి తన ట్వీట్‌లో తెలిపారు. ఐఎన్ఎస్
కోరాను 1998లో కమిషన్
చేశారు.
ప్రాజెక్టు 24ఏ కింద
ఈ యుద్ధనౌకను డిజైన్ చేశారు. కేహెచ్-35 యాంటీ మిస్సైళ్లను ఇది ప్రయోగించగలదు. ఐఎన్ఎస్
కోరాతో పాటు ఐఎన్ఎస్ కిర్చి, ఐఎన్ఎస్ కులిష్, ఐఎన్ఎస్ కార్ముక్ యుద్ధ నౌకలు భారత్ వద్ద ఉన్నాయి.
ఇటీవలే ఐఎన్ఎస్ ప్రభల్ కూడా అరేబియా సముద్రంలో మిస్సైల్ పరీక్ష చేపట్టింది.