పాక్ క్రికెట్ జట్టులో మరోక ఆటగాడికి కరోనా పాజిటివ్
By: Sankar Sat, 28 Nov 2020 10:51 PM
కివీస్ పర్యటన కోసం న్యూజిలాండ్‌లో అడుగుపెట్టిన పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మరొకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. పాక్ బృందానికి మంగళవారం జరిపిన ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షల్లో ఆరుగురికి పాజిటివ్ అని తేలగా.. శుక్రవారం నిర్వహించిన టెస్టులో మరోకరికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.
ప్రస్తుతం పాక్ జట్టు 14 రోజుల క్వారంటైన్‌లో ఉండగా.. పాజిటివ్‌గా తేలిన వారికి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించొద్దని పాక్ బృందానికి హెచ్చరికలు జారీ చేసిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇందుకోసం పాక్ జట్టు బస చేసిన హోటల్‌లో సీసీ టీవీలు ఏర్పాటు చేసింది.
కాగా టూర్ రద్దు చేస్తాం అని వార్నింగ్ ఇచ్చిన కివీస్ ప్రబుత్వం పై అక్తర్ ఫైర్ అయ్యాడు ..టూర్ రద్దు చేయడం వల్ల తమకు వచ్చిన నష్టమేమీ లేదని అతనన్నాడు. మా టీమ్ మీ దగ్గరికి వచ్చి ఆడుతోంది. బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా వచ్చే డబ్బులు మీవే. టూర్ రద్దు చేస్తే దాని వల్ల నష్టపోయేది కూడా మీరే. ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చి పాక్ టీమ్ క్రికెట్ ఆడుతున్నందుకు మీరు థ్యాంక్స్ చెప్పాలి. మీరు పాకిస్థాన్ గురించి మాట్లాడుతున్నారు. మర్యాదగా మాట్లాడండి. ఇలాంటి ప్రకటనలు ఆపేయండి. మరోసారి మాట్లాడేటప్పుడు జాగ్రత్త అని అక్తర్ చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశాడు