మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను బడ్జెట్ ధరలో విడుదల చేసిన దేశీయ స్మార్ట్‌ఫోన్ లావా
By: chandrasekar Wed, 05 Aug 2020 7:00 PM
ఈ రోజు భారత
మార్కెట్లోకి దేశీయ స్మార్ట్‌ఫోన్ మేకర్
లావా మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను బడ్జెట్ ధరలో విడుదల చేసింది. లావా జెడ్ సిరీస్‌లో
భాగంగా కొత్త హ్యాండ్‌సెట్ లావా జెడ్66 పేరుతో (4G+4G)
డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో కొత్త మోడల్‌ను
ఆవిష్కరించింది. 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్
మోడల్ ధరను రూ.7,777గా
నిర్ణయించారు. ఈ ఫోన్ మెరైన్ బ్లూ, బెర్లీ రెడ్, మిడ్‌నైట్ బ్లూ కలర్లలో వస్తున్నది. మేడిన్ ఇండియా
స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఆఫ్‌లైన్ స్టోర్లలో లభిస్తుంది. త్వరలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల
ద్వారా విక్రయాలు చేయనున్నారు.
స్పెసిఫికేషన్లు:
* డిస్‌ప్లే: 6.08 అంగుళాలు
* ప్రాసెసర్:1.6GHz ఆక్టా
కోర్
* ఫ్రంట్ కెమెరా: 13 మెగా పిక్సల్
* రియర్ కెమెరా: 13+5 మెగా పిక్సల్
* స్టోరేజ్:32జీబీ
* ర్యామ్: 3జీబీ
* ఓఎస్: ఆండ్రాయిడ్ 10
* బ్యాటరీ కెపాసిటీ:3950M