ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు మరో శుభవార్త....
By: chandrasekar Sat, 05 Dec 2020 5:10 PM
ఆపరేటర్ -సీమింగ్: ఈ
విభాగంలో మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి పూర్తి చేసిన
వారు దరఖాస్తుకు అర్హులు. ఈ పోస్టుకు ఎంపికైన వారికి రూ. 10 వేల
వరకు వేతనంతో పాటు అదనపు బెన్ఫిట్లు ఉంటాయి. పురుషులు, స్త్రీలు
ఎవరైనా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
టెక్నీషియన్ -కింట్టింగ్:
ఈ విభాగంలో మొత్తం 28 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఐటీఐ/డిప్లొమో చేసిన వారు
దరఖాస్తుకు అర్హులు. కింట్టింగ్ రిపేర్ మరియు మెయిన్ టెనెన్సు పై నైపుణ్యం
తప్పనిసరి. కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రెండు నుంచి ఐదేళ్ల
అనుభవం ఉండాలి. ఈ పోస్టుకు ఎంపికైన వారికి రూ. 20 వేల వేతనంతో పాటు అదనపు
బెన్ఫిట్స్ కూడా అందిస్తారు.
ఎలక్ట్రీషియన్: ఈ
విభాగంలో మొత్తం 5 పోస్టులను భర్తీ చేయనున్నారు. రెండు నుంచి ఐదేళ్ల వరకు అనుభవం
ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎలక్ట్రికల్ విభాగంలో
ఐటీఐ చేసిన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఈ విభాగంలో ఎంపికైన వారికి రూ. 20
వేల వేతనంతో పాటు ఇతర బెన్ఫిట్స్ ఉంటాయి. దరఖాస్తుదారులు వైర్ మాన్ లైసెన్స్
హోల్డర్ అయ్యి ఉండాలి.
ఆపరేటర్-కింట్టింగ్: ఈ
విభాగంలో మొత్తం 35 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఐటీఐ, డిప్లొమో చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. పురుషులు, స్త్రీలు ఎవరైనా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆపరేషన్ అఫ్ CNC/Knitting మెషిన్ తదితర స్కిల్స్ తప్పనిసరి. ఈ పోస్టుకు ఎంపికైన వారికి రూ. 13 వేల
వేతనంతో పాటు ఇతర బెన్ఫిట్స్ అందించనున్నారు.