ఏపీ స్కూల్స్ రీఓపెనింగ్ షెడ్యూల్ లో పలు మార్పులు ...
By: Sankar Sun, 22 Nov 2020 09:07 AM
ఏపీలో స్కూళ్ల రీ-ఓపెన్ షెడ్యూల్‌లో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. రేపటి నుంచి 6,7,8 తరగతుల విద్యార్ధులకు క్లాసులు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. కేవలం 8వ తరగతి విద్యార్ధులకు మాత్రమే తరగతులు ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
మరోవైపు రేపటి నుంచి పదో తరగతి విద్యార్ధులకు రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు క్లాసులు నిర్వహిస్తామని.. అలాగే 8,9 తరగతుల విద్యార్ధులకు రోజూ మార్చి రోజు క్లాసులు జరుగుతాయని చెప్పారు. అటు 6,7 తరగతుల విద్యార్ధులకు డిసెంబర్ 14 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని అన్నారు.
ఇక సంక్రాంతి సెలవుల తర్వాత 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్ధులకు క్లాసులు నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాగా, కరోనా నిబంధనలు పాటిస్తూ స్కూల్స్ నిర్వహిస్తామన్నారు. విద్యార్ధులు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచించారు.