ఆకట్టుకుంటున్న అనసూయ ప్రెగ్నెట్ లుక్
By: Sankar Fri, 27 Nov 2020 9:36 PM
జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది అనసూయ భరధ్వాజ్. ఒకవైపు సినిమాలు.. మరోవైపు టీవీ షోలతో ఫుల్ బిజీగా గడుపుతోంది ఈ భామ. ఈ క్రమంలోనే అనసూయ తాజాగా థ్యాంక్ యూ బ్రదర్ అనే సినిమా చేస్తుంది.
కొత్త దర్శకుడు రమేష్ రాపర్తి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ కూడా మొదలైపోయింది. అశ్విన్ విరాజ్, అనసూయ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్.. ప్రెగ్నెంట్ లేడీ పాత్రలో నటిస్తోంది. దానికి సంబంధించిన లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ హీరో సాయి ధరమ్ తేజ్.. రిలీజ్ చేశాడు. ఆమె వెనకే మరో ప్రధాన పాత్రధారి అశ్విన్ విరాజ్ సీరియస్ లుక్‌లో నిలబడి కనిపిస్తున్నారు. ఒకరి వెనుక ఒకరు నిల్చొని, పరస్పరం చూసుకుంటున్న తీరు చూస్తుంటే, ఆ ఇద్దరి మధ్య ఏదో గొడవ ఉన్నట్లు అనిపిస్తోంది.