Advertisement

  • జెపి నడ్డా , బండి సంజయ్ కు అభినందనలు ..తెలుగులో ట్వీట్ చేసిన అమిత్ షా

జెపి నడ్డా , బండి సంజయ్ కు అభినందనలు ..తెలుగులో ట్వీట్ చేసిన అమిత్ షా

By: Sankar Fri, 04 Dec 2020 9:56 PM

జెపి నడ్డా , బండి సంజయ్ కు అభినందనలు ..తెలుగులో ట్వీట్ చేసిన అమిత్ షా


కేంద్ర హోంమంత్రి అమిత్ షా జీహెచ్ఎంసీలో ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో, అభివృద్ధి లక్ష్యంగా సాగిస్తున్న బీజేపీ రాజకీయాలపై విశ్వాసం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలని పేర్కొన్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ కుమార్‌కు అభినందనలు తెలిపారు. కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు అమిత్ షా తెలుగులో ట్వీట్ చేశారు.

గ్రేటర్ ఎన్నికల్లో అమిత్ షా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర అగ్రనేతలు సైతం బల్దియా ఎన్నికల ప్రచారానికి వచ్చారు.కాగా ఈ సారి బల్దియా ఎన్నికలలో బీజేపీ అనూహ్యంగా పుంజుకొని నాలుగు స్థానాలను 48 కి పెంచుకోని రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది...

Tags :

Advertisement