గాయపడిన అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ..స్పందించిన ట్రంప్
By: Sankar Tue, 01 Dec 2020 11:06 PM
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన(ప్రెసిడెంట్ ఎలెక్ట్) జోబైడెన్ కుక్కతో ఆడుకుంటూ జారిపడడంతో కాలికి గాయమైంది. ఆయన పాదంలో వెంట్రుకవాసి ఫ్రాక్చర్‌ను వైద్యులు గుర్తించారు.
ఇది నయమయ్యేవరకు కొన్ని వారాల పాటు ఆయన వాకింగ్ బూట్ ధరించాల్సిఉంటుంది. బైడెన్ పెంచుకునే రెండేళ్ల వయసున్న జర్మన్ షెపర్డ్ కుక్క మేజర్‌తో ఆయన శనివారం ఆడుకుంటుండగా పాదం మెలికపడి జారిపడ్డారు. ఇటీవలే ఆయన 78వ పుట్టినరోజు జరుపుకున్నారు.
బైడెన్ జారిపడడంపై ట్రంప్ విచారం వ్యక్తం చేస్తూ ‘‘గెట్ వెల్ సూన్’’ అని ట్వీట్ చేశారు.కాగా ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ మీద బిడెన్ విజయం సాధించి అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక అయిన విషయం తెలిసిందే..
Tags :
america |
twisted |
ankle |