ఆగష్టు మొదటి వారంలో అమెజాన్ ప్రైమ్ డే సేల్ ...
By: Sankar Wed, 22 July 2020 11:38 AM
భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, ఇతర గృహోపకరణాలను కొనాలనుకునేవారికి సువర్ణావకాశం. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ డే-2020 సేల్ షెడ్యూల్‌ను వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఈ ఏడాది వార్షిక సేల్‌ను ఆగస్టు 6 నుంచి 7 వరకు రెండురోజుల పాటు నిర్వహించనుంది. అమెజాన్ ఆగస్టులో ప్రైమ్‌డే సేల్‌ను నిర్వహించడం ఇదే తొలిసారి. సాధారణంగా ప్రతిఏడాది జూలైలో స్పెషల్ సేల్‌ను నిర్వహిస్తూ వస్తోంది.
ప్రైమ్ డే సేల్‌లో భాగంగా గ్రేట్ డీల్స్‌తో పాటు కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయబోతోంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో కొనుగోలు చేసే వినియోగదారులకు 10 శాతం తక్షణ రాయితీ లభించనుంది. అలాగే నోకాస్ట్ ఈఎంఐ సదుపాయం, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ప్రకటించింది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెజాన్ ప్రైమ్ చందాదారులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఏడాది ప్రైమ్ డే సేల్ నిర్వహిస్తున్నది.
కాగా ఇటీవల కాలంలో ప్రజలు ఎక్కువగా ఆన్ లైన్ లోనే కొనేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు ..అసలే కరోనా కాలం కావడంతో బయటకు వెళ్లి కొనే పరిస్థితులు లేవు ..బయటకు వెళ్లిన కూడా మనకు కావాల్సిన వస్తువులు దొరకడం లేదు ..అదే ఇలాంటి ఆన్ లైన్ యాప్స్ లో అయితే ప్రతి వస్తువును ఇంట్లో కూర్చొనే ఆర్డర్ పెట్టుకొని ఇంటికే తెపించుకునే సదుపాయం ఉంది ..దీనితో వీటికి బాగా డిమాండ్ ఏర్పడింది ..